‘మీర్జాపూర్ 2’ అప్‌డేట్

దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‌’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. వారంతా సీజన్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తుండగా.. లాక్‌డౌన్‌లో కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఈ సిరీస్ గురించి అడిగారు. ఇందుకు సమాధానంగా టీజర్ రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్.. సీజన్ 2 స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అక్టోబర్ 23 నుంచి ‘మీర్హాపూర్ 2’ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు తెలిపింది. Mirzapur mein aapka swagat hai. Phirse.#Mirzapur2 […]

Update: 2020-08-24 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‌’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. వారంతా సీజన్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తుండగా.. లాక్‌డౌన్‌లో కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఈ సిరీస్ గురించి అడిగారు. ఇందుకు సమాధానంగా టీజర్ రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్.. సీజన్ 2 స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అక్టోబర్ 23 నుంచి ‘మీర్హాపూర్ 2’ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు తెలిపింది.

పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న మీర్జపూర్ సిరీస్‌ను గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ డైరెక్ట్ చేయగా ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది. మీర్జాపూర్ 2 ద్వారా భారతీయ ప్రామాణికతను కోల్పోకుండా ఉత్కంఠ భరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు నిర్మాత రితేష్ సిద్వాని. ప్రపంచవ్యాప్తంగా మీర్జాపూర్ సిరీస్ అందుకున్న ప్రశంసలు తమపై మరింత బాధ్యతను పెంచాయని.. మీర్జాపూర్ 2 ద్వారా ఆడియన్స్ అంచనాలకు మించి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

మీర్జాపూర్ సీజన్ 1 ఎండింగ్‌లో గుడ్డు సోదరుడు బబ్లూ, భార్య స్వీటీని చంపడం ద్వారా గుడ్డు జీవితాన్ని నాశనం చేస్తాడు మున్నా. కాగా గుడ్డు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుపుతూ మీర్జాపూర్ 2 టీజర్ డిజైన్ చేశారు.‘ప్రపంచం రెండు రకాల మనుషులతో విడిపోయింది. ఒకరు బతికి ఉన్నవారైతే.. మరొకరు చనిపోయిన వారు. కానీ గుడ్డు మూడో కేటగిరీకి చెందినవాడు.. అదే దెబ్బతిన్నవాడు’ అంటూ గుడ్డు రివేంజ్ స్టోరీని సెకండ్ సీజన్‌‌లో చూపించబోతున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News