ముంబై ప్రతిబింబం ‘మిర్రర్ డైలీ’ షట్‌డౌన్!
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి కేవలం వ్యక్తులపైనే కాకుండా సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు కొందరు మానసికంగా కుంగిపోతే, మరికొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు కారణం కొవిడ్-19 నియంత్రణకు విధించిన లాక్‌డౌన్. మార్చి నెలాఖరులో విధించిన దేశవ్యాప్త నిర్భంధం మూలాన చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వలస కూలీల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలినడకన వేల కుటుంబాలు రాష్ట్రాలు దాటిన సన్నివేశాలు, […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి కేవలం వ్యక్తులపైనే కాకుండా సంస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు కొందరు మానసికంగా కుంగిపోతే, మరికొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకు కారణం కొవిడ్-19 నియంత్రణకు విధించిన లాక్‌డౌన్. మార్చి నెలాఖరులో విధించిన దేశవ్యాప్త నిర్భంధం మూలాన చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వలస కూలీల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలినడకన వేల కుటుంబాలు రాష్ట్రాలు దాటిన సన్నివేశాలు, సోషల్ మీడియా దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ ప్రభావం వ్యాపార సముదాయాలు, చిన్నచిన్న సంస్థలు, స్టాటప్ కంపెనీలు, ఉద్యోగులు, ప్రింట్ మీడియా సంస్థలపై ఎక్కువ చూపింది. దీనివలన దేశ వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని పలు సర్వేలు ప్రకటించాయి.
తాజాగా దేశఆర్థిక రాజధాని ముంబై ప్రతిబింబం అయిన ‘మిర్రర్ డైలీ, పూణె డైలీ’వార్తా పత్రికను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. జాతీయ స్థాయి మీడియా దిగ్గజం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో ఈ వార్తా పత్రిక నడుస్తోంది. కరోనా వైరస్ వలన విధించిన లాక్‌డౌన్ వలన సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని.. అందువల్లే ముంబై మిర్రర్ , పూణె మిర్రర్ రెండు వార్తా పత్రికలను మూసివేస్తున్నట్లు ‘టైమ్స్ గ్రూప్’ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, పూణెలో మిర్రర్ ప్రచురణను పూర్తిగా నిలిపివేయనున్నట్లు, ముంబై మిర్రర్‌ను ప్రచురణను మాత్రం ‘వారపత్రిక’(Weekly)గా తిరిగి ప్రారంభిస్తామని మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఇక మీదట ముంబై, పూణె మిర్రర్ ప్రచురణలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయని టైమ్స్ సంస్థ వెల్లడించింది.
మిర్రర్ ముంబై నగర ప్రతిబింబం : ఎడిటర్ బాగెల్
2005 సంవత్సరంలో ప్రారంభమైన ముంబై మిర్రర్ ఒక కాంపాక్ట్ వార్తాపత్రిక. ఇది పుట్టిన నాటి నుంచే పేరుకు అనుగుణంగా జనంలోకి వెళ్లింది. ముంబై నగరానికి చెందిన అనేక మనోభావాలకు అద్దం పట్టింది. ప్రజలు మా పత్రికను మనస్ఫూర్తిగా స్వాగతించారు. తమ ప్రచురణలు ముంబై వాసుల హృదయాలకు హత్తుకున్నాయి. అయితే, కరోనా పాండమిక్ వలన ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో నెలల తరబడి చర్చలు, ప్రతిచర్చల అనంతరం మా ప్రచురణల పోర్టు ఫోలియోను ఆపివేయాలని చాలా కష్టమైన మరియు బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాము. తక్కువ సమయంలో ఇంత బలమైన బ్రాండ్‌ను నిర్మించడంలో మా పాత్రికేయులు మరియు ఇతర సిబ్బంది చేసిన సహకారాన్ని మేము నిజంగా విలువైనవిగా భావిస్తున్నాము. సంస్థ ఉన్నతికి రాత్రింబవళ్లు కృషి చేసిన పాత్రికేయులకు ముంబై మిర్రర్ ఎడిటర్ మీనాల్ బాగెల్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
ముంబై ప్రెస్‌క్లబ్ స్పందన :
ముంబై మిర్రర్, పూణె మిర్రర్ డైలీ వార్తా పత్రిక ప్రచురణను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని పున :సమీక్షించాలని టైమ్స్ గ్రూపు సంస్థను ముంబై ప్రెస్‌క్లబ్ కోరింది.మీ నిర్ణయంతో ముంబై, పూణెలోని సుమారు 150 మందికి పైగా జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు రోడ్డున పడుతారని చెప్పారు. మిర్రర్ పత్రిక మూసివేతపై టైమ్స్ ఒక ప్రకటనలో కొవిడ్ -19 మీడియా పరిశ్రమపై విప్పిన ప్రత్యేక సంక్షోభం. అది కూడా ఒక కాంతిని ప్రకాశిస్తుందని నొక్కి చెప్పింది. వార్తా పత్రిక పరిశ్రమ ఆదాయాల పరంగా కష్టతరమైనది మాత్రమే కాదని, న్యూస్ ప్రింట్ ఖర్చులకు తోర్పడే దిగుమతి సుంకం ప్రస్తుతం ఎక్కువగా ఉండటం వలన అది మరింత భారంగా మారిందని ప్రకటించింది.