తిరుపతిలో మిరాకిల్.. ఆ చిన్నారి నోటి వెంట..
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతికి చెందిన చిన్నారి బండారు సర్వజ్ఞ మిరాకిల్ చైల్డ్ అవార్డును పొందారు. ఆధ్యాత్మిక నీతి మానవత్వానికి సంబంధించిన అనేక పద్యాలు, శ్లోకాలు, కథలు సర్వజ్ఞ అలవోకగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో మంచి ఆదరణ, గుర్తింపును పొందాయి. వంద వేమన పద్యాలు, పంచతంత్రం కథలు, ఆధ్యాత్మికతకు సంబంధించిన శ్లోకాలు నోటికి కంఠాపాఠంగా వివరించే ప్రతిభను సొంతం చేసుకున్నారు. సర్వజ్ఞలోని ఈ ప్రతిభను గుర్తించి మిరాకిల్ చైల్డ్ అవార్డును ప్రకటించారు. ఆరేళ్ల […]
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతికి చెందిన చిన్నారి బండారు సర్వజ్ఞ మిరాకిల్ చైల్డ్ అవార్డును పొందారు. ఆధ్యాత్మిక నీతి మానవత్వానికి సంబంధించిన అనేక పద్యాలు, శ్లోకాలు, కథలు సర్వజ్ఞ అలవోకగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్‌లో మంచి ఆదరణ, గుర్తింపును పొందాయి. వంద వేమన పద్యాలు, పంచతంత్రం కథలు, ఆధ్యాత్మికతకు సంబంధించిన శ్లోకాలు నోటికి కంఠాపాఠంగా వివరించే ప్రతిభను సొంతం చేసుకున్నారు. సర్వజ్ఞలోని ఈ ప్రతిభను గుర్తించి మిరాకిల్ చైల్డ్ అవార్డును ప్రకటించారు. ఆరేళ్ల వయసు గల సర్వజ్ఞ తిరుపతిలోని భారతీయ విద్యా భవన్‌లో ఒకటవ తరగతి చదువుతున్నారు. సర్వజ్ఞ తల్లిదండ్రులు సంగీత, బీవీ రమణ వీరి ప్రోత్సాహంతోనే సర్వజ్ఞ పద్యాలు, శ్లోకాలు ఆసక్తిగా వల్లించే ప్రతిభను పొందారు.
ఈ సందర్భంగా సర్వజ్ఞను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అభినందించారు. ఆధ్యాత్మిక సాహిత్య ప్రతిభగల సర్వజ్ఞ అంటే చిన్నారుల ప్రతిభతో సాంస్కృతిక కేంద్రంగా తిరుపతి ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యుడు సాకం నాగరాజు మాట్లాడుతూ అద్వితీయ సంగీత, సాహిత్య ప్రతిభతో సర్వజ్ఞ భవిష్యత్తులో మరింత ఉన్నత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వజ్ఞ తల్లిదండ్రులు సంగీత, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.