కేంద్రానికి కృష్ణా బోర్డు మినిట్స్

దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో ఈ నెల 4న నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశాల మినిట్స్ వివరాలను బోర్డు చైర్మన్ పరమేశం కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర జల సంఘానికి కూడా వీటిని పంపించారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ఏపీ కొత్త ప్రాజెక్టు జీవోలపై చర్చించిన వివరాలన్నింటినీ అందులో పొందుపరిచారు. ఇరు రాష్ట్రాల నీటి వాడకం, రెండో దశ టెలిమెట్రీ ఏర్పాటు, వాటికి అవసరమైన […]

Update: 2020-06-16 11:04 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో ఈ నెల 4న నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశాల మినిట్స్ వివరాలను బోర్డు చైర్మన్ పరమేశం కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర జల సంఘానికి కూడా వీటిని పంపించారు. రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ఏపీ కొత్త ప్రాజెక్టు జీవోలపై చర్చించిన వివరాలన్నింటినీ అందులో పొందుపరిచారు. ఇరు రాష్ట్రాల నీటి వాడకం, రెండో దశ టెలిమెట్రీ ఏర్పాటు, వాటికి అవసరమైన నిధులపై చర్చించిన అంశాలు, అందులో రెండు రాష్ట్రాలు వినిపించిన వాదనలను కూడా పంపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల ప్రాథమిక సమాచారం, సమావేశంలో చర్చించిన విషయాలపై నివేదించారు.

Tags:    

Similar News