మానవత్వం చాటుకున్న మంత్రులు 

దిశ, మహబూబ్‌నగర్: ఆపదలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్‌నగర్ పట్టణనానికి చెందిన మోయిన్‌కు నాలుగేండ్ల కూతురు ఉంది. ఆ పాప క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కానీ లాక్‌డౌన్ కారణంగా మోయిన్ కుమార్తె గత నెల 27 నుంచి ఆసుపత్రికి వెళ్ళటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు మంత్రి కేటీఆర్ రామారావుకు ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించారు. […]

Update: 2020-04-04 02:02 GMT

దిశ, మహబూబ్‌నగర్: ఆపదలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్‌నగర్ పట్టణనానికి చెందిన మోయిన్‌కు నాలుగేండ్ల కూతురు ఉంది. ఆ పాప క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కానీ లాక్‌డౌన్ కారణంగా మోయిన్ కుమార్తె గత నెల 27 నుంచి ఆసుపత్రికి వెళ్ళటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు మంత్రి కేటీఆర్ రామారావుకు ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించారు. దీనికి స్పందించిన కేటీఆర్ తనకు వచ్చిన సమాచారాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు టాగ్ చేశారు. వెంటనే స్పందించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలింపునకు ఏర్పాట్లు చేశారు.

Tags : ministers, ktr, srinivas goud, hospital, child, mahaboobnagar

Tags:    

Similar News