ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి : మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల

దిశ, న్యూస్ బ్యూరో : మరో వారం రోజుల్లోగా రాష్ట్రంలో రబీ వరికోతలు ఊపందుకుంటాయని, ధాన్యం అమ్ముకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు మంత్రులు హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో‌ గురువారం సమీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 713 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, వరి కోతలను బట్టి దశలవారిగా కొనుగోలు కేంద్రాలు […]

Update: 2020-04-09 06:05 GMT

దిశ, న్యూస్ బ్యూరో : మరో వారం రోజుల్లోగా రాష్ట్రంలో రబీ వరికోతలు ఊపందుకుంటాయని, ధాన్యం అమ్ముకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు మంత్రులు హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో‌ గురువారం సమీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 713 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, వరి కోతలను బట్టి దశలవారిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రులకు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రులు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం, నిల్వ సామర్థ్యం పెంచుకోవడం కోసం ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అభిప్రాయపడ్డారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగ నిపుణుల సేవలను వినియోగించుకొని బియ్యం మిల్లింగ్ పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Tags : rabi, paddy procurement, telangana, ministers review

Tags:    

Similar News