రంగనాయకసాగర్‌కు కాళేశ్వరం నీరు విడుదల
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం చంద్లాపూర్ గ్రామశివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటిని శుక్రవారం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ విడుదల చేశారు. సర్జిపూల్‌కు చేరుకున్న గోదావరి జలాలను పంపుల ద్వారా రంగనాయకసాగర్‌లోకి వదిలారు. అంతకుముందు చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టులో పనిచేసిన కార్మికులు, అధికారులను వారు సన్మానించారు. కార్మికులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం మంత్రులు స్విచ్ ఆన్ చేసి పంపులు ఆన్ […]
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చిన్నకోడురు మండలం చంద్లాపూర్ గ్రామశివారులో నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటిని శుక్రవారం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ విడుదల చేశారు. సర్జిపూల్‌కు చేరుకున్న గోదావరి జలాలను పంపుల ద్వారా రంగనాయకసాగర్‌లోకి వదిలారు. అంతకుముందు చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టులో పనిచేసిన కార్మికులు, అధికారులను వారు సన్మానించారు. కార్మికులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం మంత్రులు స్విచ్ ఆన్ చేసి పంపులు ఆన్ చేయడంతో రంగనాయక సాగర్‌లోకి గోదారి జలాలు పరవళ్లు తొక్కాయి. గోదారి జలాలు పొంగి పొర్లడంతో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు ఆనందం వ్యక్తం చేశారు.
Tags: Harish Rao, KCR, Kaleshwaram water, Ranganayaka Sagar, siddipet