వరంగల్‌: శాశ్వత పరిష్కారానికి కేటీఆర్ హామీ

దిశ ప్రతినిధి, వరంగల్: వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో మంగళవారం వరంగల్ కు వచ్చిన మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఓరుగల్లులో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితుల […]

Update: 2020-08-18 00:08 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: వర్షం కారణంగా జరిగిన నష్టానికి అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఈ సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో మంగళవారం వరంగల్ కు వచ్చిన మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.

ఓరుగల్లులో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నాలాల వెంట అక్రమ నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని, ఈ అక్రమ నిర్మాణాలు అన్నింటినీ తొలగిస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కేటీఆర్ కాలనీ ప్రజలను కోరారు. తాత్కాలిక సాయం చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం అందిస్తామన్నారు. మంత్రులతోపాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, ధర్మారెడ్డి, మేయర్ గుండా ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లాల అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.

Tags:    

Similar News