లాభసాటి పంటలపై దృష్టి సారించండి : వేముల
దిశ, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.ఆదివారం బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి ప్రతినిధులు, అధికారులతో లాభాసాటి వ్యవసాయంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు లాభసాటి వ్యవసాయ విధానం వైపు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు.బాల్కొండ […]
దిశ, నిజామాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.ఆదివారం బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి ప్రతినిధులు, అధికారులతో లాభాసాటి వ్యవసాయంపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు లాభసాటి వ్యవసాయ విధానం వైపు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు.బాల్కొండ నియోజకవర్గంలో పోయిన ఏడాది 60వేల ఎకరాల్లో వరి సాగు అయిందన్నారు.ఈ వానాకాలం 60ఎకరాల్లో వరి వేసుకోవచ్చు కానీ, 30 వేల ఎకరాల్లో సన్నరకం, 30 వేల ఎకరాల్లో దొడ్డు రకం వేయాలని సూచించారు.గత సీజన్లో 30 వేల ఎకరాల్లో మక్క పంట వేయగా, ఈ సారి మొక్కజొన్న వేయొద్దన్నారు. అలాగే 25వేల ఎకరాల్లో సొయా పంట వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మిగతా ఐదు ఎకరాల్లో పత్తి, కూరగాయలు, కంది ఇతర పంటలు వేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం 40వేల ఎకరాల్లో పసుపు పంట సాగు అవుతోందని, కేవల పసుపు పంటకు అంతర్ పంటగా మాత్రమే మక్కను వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.