దేశంలో చెప్పిన పనిని చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
దిశ, నల్లగొండ: కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎన్నికల తర్వాత పోడుభూముల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని చెప్పారు. దేశంలో చెప్పిన ప్రతీ పనిని పూర్తి చేసే ఏకైక సీఎం కేసీఆర్ అని […]
దిశ, నల్లగొండ: కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎన్నికల తర్వాత పోడుభూముల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని చెప్పారు. దేశంలో చెప్పిన ప్రతీ పనిని పూర్తి చేసే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీసీలు, మైనార్టీలు ఐక్యంగా ఉండి, బీసీలకు కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
కాంగ్రెస్ నాయకులు బరి తెగించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమని, వారు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఎంపీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారని, దీనిపై ఎన్నికల కమిషన్, పోలీసులు స్పందించాలని కోరారు. నియోజకవర్గంలో ఎన్నడూ అందుబాటులో ఉండని జానారెడ్డి టీఆర్ఎస్‌ను విమర్శించడం హస్యాస్పదమన్నారు. జానారెడ్డి గెలిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరు నుంచి ఏడుకు మారుతుంది తప్ప, నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోదని అన్నారు. సాగర్ నియోజవర్గం అభివృద్ధి చెందాలంటే, ప్రభుత్వం ద్వారానే సాధ్యమని, కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే అభివృద్ధి శూన్యమని అన్నారు.