పేదల ఇళ్లు కూల్చిన చరిత్ర కాంగ్రెస్‌ది
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ దగ్గర పేదల ఇళ్లను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, జూబ్లీహిల్స్‌లో డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తుంటే కోర్టుకు వెళ్లి కేసులు వేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నమంత్రి తలసాని… అధికారంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నేతలు దగ్గరకు రానివ్వలేదని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు […]
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ దగ్గర పేదల ఇళ్లను కూల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, జూబ్లీహిల్స్‌లో డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తుంటే కోర్టుకు వెళ్లి కేసులు వేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నమంత్రి తలసాని… అధికారంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నేతలు దగ్గరకు రానివ్వలేదని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదని, అసలు ఆపార్టీని ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.