ఆ విషయంలో హర్షం వ్యక్తం చేసిన మంత్రి తలసాని..
దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు భక్తులు కూడా ఎంతో సహకరించారని వారికి అభినందనలు తెలిపారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించే అమ్మవారి బోనాలను ఈయేడు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కేవలం ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించినట్టు వివరించారు. సాంప్రదాయ బద్ధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా […]
దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు భక్తులు కూడా ఎంతో సహకరించారని వారికి అభినందనలు తెలిపారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించే అమ్మవారి బోనాలను ఈయేడు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కేవలం ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించినట్టు వివరించారు. సాంప్రదాయ బద్ధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి జాతర నిర్వహించిన ఆలయ అధికారులు, పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, అందుకు సహకరించిన పోలీసు, జీహెచ్ఎంసీ, విద్యుత్, వైద్య శాఖ, ఆర్‌అండ్‌బీ తదితర అన్ని శాఖల అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మంత్రి అభినందనలు తెలిపారు.