‘డబుల్’ పురోగతిపై మంత్రుల సమీక్ష..

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌కు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో రూ.812 కోట్లతో 7,455 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం […]

Update: 2020-08-21 08:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌కు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో రూ.812 కోట్లతో 7,455 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 1,144 ఇళ్లు ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, దసరా నాటికి మరో 3,200 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దసరా కానుకగా 21 ప్రాంతాల్లో 4,358 డుబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతామని మంత్రి తలసాని వెల్లడించారు.

Tags:    

Similar News