శివా.. శివా.. ఇదేం పైరవీ!
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని డీసీఎంఎస్‌లో పదోన్నతులపై పాలకవర్గాలు ఇష్టారాజ్యంగా తీర్మానాలు చేస్తున్నాయి. జిల్లా సహకార సంఘంలోని అధికారికి గానీ, అందులో ఒక డైరెక్టర్‌గా ఉండే అదనపు కలెక్టర్‌కుగానీ సమాచారం లేకుండానే ఈ తీర్మానాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసుత్తం డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్‌గా ఉన్న పి.శివారెడ్డి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. అయితే జిల్లా మంత్రి అండదండల కారణంగా శివారెడ్డి పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. అదీగాక శివారెడ్డి […]
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని డీసీఎంఎస్‌లో పదోన్నతులపై పాలకవర్గాలు ఇష్టారాజ్యంగా తీర్మానాలు చేస్తున్నాయి. జిల్లా సహకార సంఘంలోని అధికారికి గానీ, అందులో ఒక డైరెక్టర్‌గా ఉండే అదనపు కలెక్టర్‌కుగానీ సమాచారం లేకుండానే ఈ తీర్మానాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసుత్తం డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్‌గా ఉన్న పి.శివారెడ్డి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. అయితే జిల్లా మంత్రి అండదండల కారణంగా శివారెడ్డి పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. అదీగాక శివారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని ఏడాది ముందుగా గత పాలకవర్గమే తీర్మానం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో అనుకూల వ్యక్తులను అందలం ఎక్కిస్తున్నారంటూ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏడేండ్ల కిందట శివారెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి, తన కంటే సీనియర్లయిన ముగ్గురు అధికారులను పక్కనబెట్టించి మరీ బిజినెస్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు మరో ఏడాదిపాటు పదవీ కాలాన్ని పొడిగించుకోవడంతో మరో ఇద్దరు సీనియర్ అధికారులకు అన్యాయం జరగనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్ సొసైటీలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విధంగా అలవెన్సులు, జీతాలు, డీఏలు, పీఆర్సీలు వర్తిస్తాయి. కానీ, అధికార పార్టీ అండదండలు లేదా జిల్లాలో ఆధిపత్యం చలాయించే మంత్రి, ఎమ్మెల్యేల మద్దతుంటేనే సులభంగా పదోన్నతులు పొందుతుండటం గమనార్హం.