ఏపీలో ‘లోకల్ వార్’.. కూటమికే జై..

ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2025-03-27 06:41 GMT
ఏపీలో ‘లోకల్ వార్’.. కూటమికే జై..
  • whatsapp icon

28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు

మేజరు ఎంపీపీ స్థానాలు దక్కించుకుంటున్న కూటమి

వైసీపీ జడ్పీటీసీ పదవి వైసీపీకే..

అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ సహా 28 ఎంపీపీలు, 23 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు ఎన్నికలు మొదలయ్యాయి. వాటితో పాటు 12 మండల పరిషత్ లలో కో-ఆప్షన్ సభ్యు, 214 గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల ఎంపిక కూడా జరగనుంది. కూటమి, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. నిన్న సత్యసాయి జిల్లా రామగిరిలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వైఎస్సార్​జిల్లా పరిషత్​చైర్మన్​ ఎన్నిక ఏకగ్రీవం అయింది. చైర్మన్​గా వైసీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒకే ఒక్క నామినేషన్​రావడంతో రామగోవిందరెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇక్కడి జిల్లా పరిషత్​చైర్మన్ పదవికి తాము పోటీ పడడం లేదని కూటమి ప్రకటించింది. అయినా చివరి నిముషం వరకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా పరిషత్​చైర్మన్​పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో, ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను నాలుగు రోజుల పాటు క్యాంపులో ఉంచారు. వైసీపీ జడ్పీటీసీలు హైదరాబాద్ క్యాంప్ నుంచి కడపకు చేరుకున్నారు.

రామగిరి ఎంపీడీవో కార్యాలయం వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పలువురు ఎంపీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కాకినాడ రూరల్​ ఎంపీటీసీ ఎన్నికను 8 మంది వైసీపీ ఎంపీటీసీలు బషిష్కరించారు. తిరుపతి రూరల్​ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి మొత్తం 40మంది ఎంపీటీసీలు ఉన్నారు. వైసీపీ నుంచి 27 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అయితే తమ ఎంపీటీసీలను కాపాడుకునేందుకు వారిని క్యాంపునకు తరలించింది. వారంరోజులుగా అక్కడే ఉంచి పోలీసు బందోబస్తు నడుమ వారిని కార్యాలయానికి తరలించారు. కాకినాడ రూరల్​ఎంపీపీ ఎన్నికను 8మంది ఎంపీటీసీలు బహిష్కరించారు. వైసీపీ నుంచి జనసేనలోకి ఏడుగురు చేరారు. పది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్యే నానాజీ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. కాకినాడ రూరల్​ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కైకలూరు వైఎస్​ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం కూటమి, వైసీపీ పోటీపడుతున్నాయి. ఇక్కడి 20 ఎంపీటీసీ స్థానల్లో కూటమికి 10, వైసీపీకి 10 ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మాదిపాడు ఎంపీటీసీ స్వర్ణమ్మబాయి ఎంపికయ్యారు. ఎంపీపీ ఎన్నికకు పది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఆమెకు మద్దతుగా 9 మంది ఎంపీటీసీలు నిలిచారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవిని కూటమి దక్కించుకుంది. 10 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీగా జమీన్​ఎన్నికయ్యారు. ఇక్కడ ఎంపీపీ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది.

Tags:    

Similar News