స్వార్ధ ప్రయోజనల కోసం విమర్శలు చేస్తున్నారు.
దిశ ప్రతినిధి , హైదరాబాద్: వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందనీ.. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. నగరంలోని అంబర్ పేట్ , గోషామహల్ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల మూలంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ 10 వేల ఆర్ధిక సహాయాన్ని […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందనీ.. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. నగరంలోని అంబర్ పేట్ , గోషామహల్ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల మూలంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ 10 వేల ఆర్ధిక సహాయాన్ని ఆయన శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కనీ వినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు కురిసి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో రాజకీయ లబ్దికోసం పాకులాడటం సిగ్గుచేటన్నారు.
సీఎం కేసీఆర్ పెద్దమనసుతో స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పై బీజేపీ నేతలు విమర్శలు మాని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాలని సూచించారు.