బాక్సింగ్ క్రీడాకారిణికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందన
దిశ, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్‌కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి ఎస్.ఎమ్ వైష్ణవిని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హర్యానాలో జరిగిన మొదటి టీఏఎఫ్ఐఎస్ఏ ఓపెన్ నేషనల్ గేమ్స్-2021లో వైష్ణవి గోల్డ్ మెడల్ సాధించిన క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వైష్ణవిని మంత్రి సత్కరించారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, అందుకోసం క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ వైష్ణవి రాణించాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో నేపాల్‌లో జరగనున్న ఇండో […]
దిశ, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్‌కు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి ఎస్.ఎమ్ వైష్ణవిని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హర్యానాలో జరిగిన మొదటి టీఏఎఫ్ఐఎస్ఏ ఓపెన్ నేషనల్ గేమ్స్-2021లో వైష్ణవి గోల్డ్ మెడల్ సాధించిన క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వైష్ణవిని మంత్రి సత్కరించారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, అందుకోసం క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ వైష్ణవి రాణించాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో నేపాల్‌లో జరగనున్న ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్‌లో బాక్సింగ్‌లో తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్ కృష్ణ, తల్లిదండ్రులు శ్రీనివాస్, వెన్నెల తదితరులు ఉన్నారు.