పోలీస్ శాఖలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తాం : మంత్రి

దిశ, క్రైమ్‌బ్యూరో: పోలీస్ శాఖలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురానున్నట్టు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. గోషామహల్ శివకుమార్‌లాల్ పోలీస్ స్టేడియంలో మూడ్రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఒలింపిక్ మెడలిస్ట్, పద్మశ్రీ గగన్ నారంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు అద్భుతమైన సేవలందించారని కొనియాడారు. ‘స్పోర్ట్స్ మీట్‌’లో పోలీసులు గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటారన్నారు. […]

Update: 2021-02-12 08:52 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: పోలీస్ శాఖలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురానున్నట్టు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. గోషామహల్ శివకుమార్‌లాల్ పోలీస్ స్టేడియంలో మూడ్రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఒలింపిక్ మెడలిస్ట్, పద్మశ్రీ గగన్ నారంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు అద్భుతమైన సేవలందించారని కొనియాడారు. ‘స్పోర్ట్స్ మీట్‌’లో పోలీసులు గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటారన్నారు. గగన్ నారంగ్ మాట్లాడుతూ.. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులు క్రీడాస్ఫూర్తిని చాటడం హర్షణీయమన్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సీపీ అంజనీకుమార్, అడిషనల్ సీపీలు శిఖా గోయెల్, అనిల్ కుమార్, జాయింట్ సీపీలు విశ్వ ప్రసాద్, ఏఆర్ శ్రీనివాస్, అవినాష్ మహంతి పాల్గొన్నారు.

Tags:    

Similar News