నియమాలు పాటిస్తున్నారా.. లేదా..? : శ్రీనివాస్ గౌడ్

దిశ, మహబూబ్ నగర్: జిల్లా వాసులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా వద్ద మంత్రి.. లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని వాహనదారులను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో, కార్లను, బస్సులను పరిశీలించారు. మాస్క్ లు ధరించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు […]

Update: 2020-06-09 03:57 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లా వాసులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా వద్ద మంత్రి.. లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని వాహనదారులను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో, కార్లను, బస్సులను పరిశీలించారు. మాస్క్ లు ధరించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన 40 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎంపీపీ కార్యాలయంలో అందజేచేశారు.

Tags:    

Similar News