మహబూబ్‌నగర్‌లో ‘మహా’ డ్వాక్రా ఎగ్జిబిషన్ ప్రారంభం
దిశ, మహబూబ్‌నగర్: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, అందుకు ప్రభుత్వం అని రకాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో జరిగిన డ్వాక్రా ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను జిల్లా కలెక్టర్ వెంకటరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ‘మహా’ (మహబూబ్ నగర్ […]
దిశ, మహబూబ్‌నగర్: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, అందుకు ప్రభుత్వం అని రకాలుగా సహకరిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో జరిగిన డ్వాక్రా ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను జిల్లా కలెక్టర్ వెంకటరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ‘మహా’ (మహబూబ్ నగర్ మహిళా ప్రొడక్ట్స్) పేరును నామకరణం చేసి, లోగోను ఆవిష్కరించారు. అనంతరం పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య- మహబూబ్ నగర్ జిల్లాలోని 950 స్వయం సహాయక గ్రూపులకు రూ.10.92 కోట్ల చెక్కును మహిళా గ్రూప్ సభ్యులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.