రైతులు అధైర్య పడొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: రైతులు పండించిన పంటల విషయంలో అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడబల్లూర్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో పండించిన మొక్కజొన్న, వరిని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ […]
దిశ, మహబూబ్‌నగర్: రైతులు పండించిన పంటల విషయంలో అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడబల్లూర్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో పండించిన మొక్కజొన్న, వరిని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. అలాగే గన్నీ బ్యాగుల కొరత రాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి చందన, మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి , నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: formers, dont worry, minister, srinivas goud, govt, help formers, visit purchase,center