మహబూబ్‌నగర్ ప్రజలకు ఇవాళ మంచిరోజు.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, మహబూబ్‌నగర్: భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ మెడికల్ హబ్‌గా మారనుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం పత్రాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం వైద్యశాఖకు మంత్రి అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ఇవాళ మంచిరోజు అన్నారు. సమైక్య రాష్ట్రంలో సరైన వైద్యం అందక హైదరాబాద్ తీసుకెళ్తుంటే మార్గంమధ్యలోనే చనిపోయేవారని తెలిపారు. పాత కలెక్టరేట్‌ను ఆసుపత్రిగా మారుద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి […]

Update: 2021-08-02 05:53 GMT

దిశ, మహబూబ్‌నగర్: భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ మెడికల్ హబ్‌గా మారనుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం పత్రాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం వైద్యశాఖకు మంత్రి అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు ఇవాళ మంచిరోజు అన్నారు. సమైక్య రాష్ట్రంలో సరైన వైద్యం అందక హైదరాబాద్ తీసుకెళ్తుంటే మార్గంమధ్యలోనే చనిపోయేవారని తెలిపారు. పాత కలెక్టరేట్‌ను ఆసుపత్రిగా మారుద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. అందులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కలెక్టరేట్‌కు మారిన తరువాత ఇక్కడ పని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రూ.300 కోట్లతో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామని, ఏర్పాటుకు అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, రెవెన్యు అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News