మహబూబ్‌నగర్‌లో యాచకుల కోసం ఆశ్రమం
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రమాన్ని శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు యాచకులు, అనాథలకు బట్టలు, దుప్పట్లు, సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో యాచకులు, అనాథలు ఆకలితో బాధ పడకూడదని ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వీరికి పని కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను యాచకులు వినియోగించుకోవాలని, పరిశుభ్రంగా […]
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రమాన్ని శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు యాచకులు, అనాథలకు బట్టలు, దుప్పట్లు, సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో యాచకులు, అనాథలు ఆకలితో బాధ పడకూడదని ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వీరికి పని కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను యాచకులు వినియోగించుకోవాలని, పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. వీరికి భోజనంతోపాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Tags: Minister srinivas goud, shelter, beggars, mahabubnagar