మీకు తప్పకుండా న్యాయం చేస్తాం : శ్రీనివాస్ గౌడ్

దిశ, మహబూబ్ నగర్: పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారు ఎంతటి వారైనా వదిలబోమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 13న మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించి తిరిగి వెళుతున్న క్రమంలో గంటేల వెంకటేష్ కుటుంబం భూమి సమస్య విషయమై మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన విషయం తెలిసిందే. బుధవారం ఈ విషయమై మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్. వెంకట రావు సమక్షంలో  […]

Update: 2020-07-15 09:27 GMT

దిశ, మహబూబ్ నగర్: పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారు ఎంతటి వారైనా వదిలబోమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 13న మున్సిపల్ మంత్రి కేటీఆర్ వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించి తిరిగి వెళుతున్న క్రమంలో గంటేల వెంకటేష్ కుటుంబం భూమి సమస్య విషయమై మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన విషయం తెలిసిందే. బుధవారం ఈ విషయమై మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్. వెంకట రావు సమక్షంలో ఆర్డీవో, డీస్పీ శ్రీధర్, తహసీల్దార్‌లతో పాటు, బాధిత కుటుంబ సభ్యులందరినీ పిలిచి విచారించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు అండగా ఉండేందుకే తాను మహబూబ్ నగర్‌ను ఎంచుకొన్నానని వివరించారు. అలాంటిది ఎవరైనా పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, భూ కబ్జాదారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడిన గంటేల వెంకటేష్ చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యకి అని మంత్రి చెప్పారు. అతనికి ఉన్న భూమి సమస్య గురించి తనను ఎప్పుడు సంప్రదించలేదని వస్తే, ఎప్పుడో పరిష్కరించే వాడినని పేర్కొన్నారు. వెంకటేష్ కుటుంబానికి భూమి అమ్మిన వ్యక్తి , అదే భూమిని మరొకరికి కూడా అమ్మినట్లు తేలిందన్నారు. దీనిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మంత్రి స్వయంగా డీఎస్పీ శ్రీధర్‌ను పిలిపించి ఆదేశించారు.

అంతేకాక బాధిత కుటుంబానికి న్యాయంగా చెందాల్సిన భూమిని వందశాతం ఇప్పిస్తానని మంత్రి హామీనిచ్చారు. ఇకమీదట పేదలను మోసం చేసినా, దౌర్జన్యం చేసినా సహించబోమని ఆయన పునరుద్ఘాటించారు. వారి భూమిని వెంటనే ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపాలని అదనపు కలెక్టర్ సీతారామ రావును ఇదివరకే ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

Tags:    

Similar News