నిబంధనలు కఠినతరం చేయండి: శ్రీనివాస్ గౌడ్

దిశ. మహబూబ్‌నగర్: కరోనా నివారణ చర్యలు కఠినతరం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటికే పలుమార్లు వ్యాపారస్తులకు నిర్ణీత దూరంగా ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. వివిధ షాపులను పరిశీలించగా వారు నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని షాప్‌లను 6 మాసాలు సీజ్ చేయాలని సంబంధిత […]

Update: 2020-04-09 10:11 GMT

దిశ. మహబూబ్‌నగర్: కరోనా నివారణ చర్యలు కఠినతరం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పటికే పలుమార్లు వ్యాపారస్తులకు నిర్ణీత దూరంగా ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. వివిధ షాపులను పరిశీలించగా వారు నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని షాప్‌లను 6 మాసాలు సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ మరొక్కరికి వచ్చిందని ఆయన వెల్లడించారు. పట్టణ కేంద్రంలోని మంచినూనె కంపెనీలు ఉత్పత్తిని పెంచాలని సూచించారు. పని చేసే వారికి అదనంగా వేతనం ఇవ్వాలని కంపెనీల యాజమాన్యాలను మంత్రి కోరారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ముద్ర వేసి క్వారంటైన్‌లో ఉంచడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు మరింతగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిస్కారిస్తామని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags: minister srinivas goud, meeting, Essential merchants, mahabubnagar

Tags:    

Similar News