హెరిటేజ్ అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రామప్ప దేవాలయ సమీపంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హరిటేజ్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర హరిటేజ్ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప దేవలయాన్ని యునెస్కో గుర్తించినందుకు హెరిటేజ్ శాఖ తరపున, సీఎం కేసీఆర్ తరుపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. […]

Update: 2021-07-30 11:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రామప్ప దేవాలయ సమీపంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హరిటేజ్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర హరిటేజ్ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామప్ప దేవలయాన్ని యునెస్కో గుర్తించినందుకు హెరిటేజ్ శాఖ తరపున, సీఎం కేసీఆర్ తరుపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. యునెస్కో సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం డిసెంబర్ 2022లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై ఆయన చర్చించి పలు సూచనలు చేశారు. రామప్ప దేవాలయం అభివృద్ధి పై రూపొందించిన నివేదికను సీఎం కేసీఆర్‌తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమార్, వైఏటీసీ జాయింట్ సెక్రటరీ రమేష్, హెరిటేజ్ అధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News