పైసల కోసం కేసీఆర్ కాళ్లు మొక్కుతా: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే.. పాలమూరు అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు తమ వార్డులలో చేసిన పనులు, చేపట్టవలసిన కార్యక్రమాలన గురించి సభలో ప్రస్తావించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో తాగునీటికి నానా ఇబ్బందులు పడాల్సి […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే.. పాలమూరు అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు తమ వార్డులలో చేసిన పనులు, చేపట్టవలసిన కార్యక్రమాలన గురించి సభలో ప్రస్తావించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో తాగునీటికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య లేదన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, కూడళ్లను వెడల్పు చేస్తున్నామన్నారు. ఇదే సమయంలో వీధి వ్యాపారులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికై పాలమూరు అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని.. ఈ క్రమంలోనే అందుకు కావాల్సిన నిధుల కోసం సీఎం కాళ్లు అయినా మొక్కడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు.