క్రీడాకారులను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారులను సన్మానించారు. అక్టోబర్ 18 నుండి 23 వరకు ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్‌లో సబ్ జూనియర్ విభాగంలో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు.. బాలికల విభాగంలో లహరి M. గిరీష్ (13 years) 45 KG , బాలుర విభాగంలో ఆశిష్ చంద్ (54 […]

Update: 2021-11-23 03:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారులను సన్మానించారు. అక్టోబర్ 18 నుండి 23 వరకు ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్‌లో సబ్ జూనియర్ విభాగంలో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు.. బాలికల విభాగంలో లహరి M. గిరీష్ (13 years) 45 KG , బాలుర విభాగంలో ఆశిష్ చంద్ (54 KG)లను సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడలను, క్రీడాకారులను తయారు చేస్తున్నామని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి గౌడ్, కిక్ బాక్సింగ్ కోచ్‌లు అరుణ్ సింగ్, అవినాష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News