జిల్లాకో ప్రత్యేక క్రీడా అధికారి !

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రతీ జిల్లాకు ఒకరు చొప్పున ప్రత్యేక క్రీడా అధికారి ఉండాలని అధికారులను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ అదేశించారు. పలు జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా యువజన సర్వీసుల అధికారి పోస్టుల్లో క్రీడాశాఖ అధికారులను ఇంచార్జిలుగా నియమించాలని లేదా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపికచేసి, వెంటనే నియమించాలని క్రీడా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్రీడా శిక్షణ కార్యక్రమాలు జరగాలని, నిబంధనలను […]

Update: 2020-10-23 10:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రతీ జిల్లాకు ఒకరు చొప్పున ప్రత్యేక క్రీడా అధికారి ఉండాలని అధికారులను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ అదేశించారు. పలు జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా యువజన సర్వీసుల అధికారి పోస్టుల్లో క్రీడాశాఖ అధికారులను ఇంచార్జిలుగా నియమించాలని లేదా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపికచేసి, వెంటనే నియమించాలని క్రీడా శాఖ కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్రీడా శిక్షణ కార్యక్రమాలు జరగాలని, నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడలపై, స్టేడియంల నిర్మాణంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా పై ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని, నూతనంగా ఎర్పాటు చేయబోయే వాలీబాల్, బాక్సింగ్, ఆర్చరీ, హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ అకాడమీల ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలను కూడా రూపొందించాలని అధికారులకు సూచించారు.

Tags:    

Similar News