అవి కలగానే మిగిలిపోయాయి -మంత్రి శ్రీనివాస్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : విజయదశమిని పురస్కరించుకుని వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టాలు అందజేశారు. ముందుగా దివ్యాంగులకు పట్టాలు అందజేసిన ఆయన ఆ తర్వాత మహిళా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత 70 ఏళ్ళలో పేదవాడి ప్రాథమిక అవసరాలు అయిన కూడు గూడు గుడ్డ కలగానే మిగిలిపోయాయని, పేదవాడి సొంత ఇంటి స్వప్నాన్ని నిజం […]

Update: 2020-10-25 08:01 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : విజయదశమిని పురస్కరించుకుని వీరన్నపేట డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టాలు అందజేశారు. ముందుగా దివ్యాంగులకు పట్టాలు అందజేసిన ఆయన ఆ తర్వాత మహిళా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత 70 ఏళ్ళలో పేదవాడి ప్రాథమిక అవసరాలు అయిన కూడు గూడు గుడ్డ కలగానే మిగిలిపోయాయని, పేదవాడి సొంత ఇంటి స్వప్నాన్ని నిజం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆ క్రమంలోనే జిల్లా కేంద్రంలో వీరన్నపేట్ లో నిర్మించిన ఇళ్లను ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించారని లబ్ధిదారులు అందరికీ ఈ రోజు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News