టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో కరోనా టీకా తీసుకున్నారు. శుక్రవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన తల్లి శాంతమ్మ, సోదరుడు శ్రీకాంత్ గౌడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. బయట సంచరించే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.