సహకార వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావాలి: శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: సహకార వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు కృషిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో డీసీసీబీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మహాజన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని బతికించేది రైతు అని, సహకార వ్యవస్థ ద్వారా రైతుకు సేవ చేయడం అదృష్టమన్నారు. ఎన్నో ఉత్పత్తులకు సహకార వ్యవస్థ జీవం పోస్తుందన్నారు. […]
దిశ, మహబూబ్‌నగర్: సహకార వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు కృషిచేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో డీసీసీబీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మహాజన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని బతికించేది రైతు అని, సహకార వ్యవస్థ ద్వారా రైతుకు సేవ చేయడం అదృష్టమన్నారు. ఎన్నో ఉత్పత్తులకు సహకార వ్యవస్థ జీవం పోస్తుందన్నారు.
గతంలో సహకార వ్యవస్థకు మంచి పేరు ఉండేదని, రాను రానూ ఈ పేరు పోయిందని, తిరిగి పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సహకార రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ ఇప్పించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వారిగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా .. 22 శాఖలున్నాయని వీటికి అవసరమైన భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సొసైటీలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలని, సొసైటీల డైరెక్టర్లు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సహకార వ్యవస్థలో మంచి మార్పు వచ్చిందనే పేరు తీసుకురావాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.