ఏపీ నేతలు వైఖరి మార్చుకోవాలి: శ్రీనివాస్ గౌడ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీపడలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడు తమ హయాంలో మొదలుకాలేదని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ నేతలు తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని అన్నారు. ఏపీ నేతలు ఇప్పటికైనా తమ […]

Update: 2020-08-11 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీపడలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. పోతిరెడ్డిపాడు తమ హయాంలో మొదలుకాలేదని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ నేతలు తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని అన్నారు. ఏపీ నేతలు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహారాష్ట్రతో మంచి సంబంధాలు ఉండడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News