‘అడ్డుకోనంటే ఉస్మానియాను అద్భుతం చేస్తాం’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిలో డ్రైనేజీ నీరు చేరిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. అటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియా నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వర్షానికి ఆస్పత్రిలో నీరు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ-కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఎనాడైనా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రిలో డ్రైనేజీ నీరు చేరిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. అటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియా నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్.. వర్షానికి ఆస్పత్రిలో నీరు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ-కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఎనాడైనా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 2015లోనే కేసీఆర్ కొత్త భవన ప్రతిపాదన తేస్తే అడ్డుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉస్మానియాకు నూతన భవనాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. అలాంటి వారు ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రిపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి పక్షాలు అడ్డుకోకపోతే కొత్త భవనాన్ని నిర్మించేందుక ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సవాల్ విసిరారు. ఒక్క ఏడాదిలోపే అద్భుత నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కరోనా వైరస్ కంటే ప్రమాదంగా తయారైందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చురకలు వేశారు.