సీఎం విధానాలతోనే ఇదంతా జరిగింది: నిరంజన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సాగు, సానుకూల విధానాలతోనే తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ.. ‘అన్నపూర్ణ’గా మారిందని కొనియాడారు. ఇందుకు గత ఏడాది ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణనే నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ నుండే సేకరించడం విశేషమన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల మీద అవగాహనతో ముందుకు సాగాలని.. వివిధ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆయన సూచనలతోనే […]
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సాగు, సానుకూల విధానాలతోనే తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరున్నరేళ్లలో తెలంగాణ.. ‘అన్నపూర్ణ’గా మారిందని కొనియాడారు. ఇందుకు గత ఏడాది ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణనే నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ నుండే సేకరించడం విశేషమన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల మీద అవగాహనతో ముందుకు సాగాలని.. వివిధ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారని మంత్రి చెప్పుకొచ్చారు. ఆయన సూచనలతోనే మంచి ఫలితాలు సాధించామన్నారు.