భవిష్యత్తు మొత్తం ఆ రంగానిదే.. జోస్యం చెప్పిన మంత్రి సింగిరెడ్డి

దిశ, నాగర్‌కర్నూల్: భవిష్యత్తులో వ్యవసాయంపైనే ఆధారపడి అన్ని రంగాలు కేంద్రీకృతం కాబోతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాగర్‌కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతన హాస్టల్‌ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 700 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, సమాజంలో ఉన్న అవకాశాలకు చదివిన చదువులకు పొంతన లేకుండా ఉండేదన్నారు. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా […]

Update: 2021-10-09 06:29 GMT

దిశ, నాగర్‌కర్నూల్: భవిష్యత్తులో వ్యవసాయంపైనే ఆధారపడి అన్ని రంగాలు కేంద్రీకృతం కాబోతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాగర్‌కర్నూలు జిల్లా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతన హాస్టల్‌ను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 700 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, సమాజంలో ఉన్న అవకాశాలకు చదివిన చదువులకు పొంతన లేకుండా ఉండేదన్నారు. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా కళాశాలలకు అనుమతులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీశాయన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నివారణ చర్యలు చేపట్టి సంప్రదాయ పద్ధతిలో పాలన జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పూర్వపు ఉమ్మడి జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల ఉండాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రాబోయే కాలంలో ప్రపంచానికి అన్నం పెట్టేది కేవలం భారతదేశం మాత్రమేనని మంత్రి సింగిరెడ్డి జోస్యం చెప్పారు.

Tags:    

Similar News