కాళేశ్వరం అవినీతిపై పరీక్ష పెట్టండి.. ప్రతిపక్షాలకు సింగిరెడ్డి సవాల్
దిశ, నాగర్‌కర్నూల్: కేసీఆర్ చావుదాకా వెళ్లి రాష్ట్రాన్ని సాధించినప్పుడు అండగా లేనోళ్లు.. అప్పటికే ఆంధ్రోళ్ల బానిసలుగా ఉన్నవారు ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా అంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో.. పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా నూతన అధ్యక్షుడిగా గంగణమోని కూర్మయ్యను మార్కెట్ శాఖ అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ […]
దిశ, నాగర్‌కర్నూల్: కేసీఆర్ చావుదాకా వెళ్లి రాష్ట్రాన్ని సాధించినప్పుడు అండగా లేనోళ్లు.. అప్పటికే ఆంధ్రోళ్ల బానిసలుగా ఉన్నవారు ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా అంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో.. పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా నూతన అధ్యక్షుడిగా గంగణమోని కూర్మయ్యను మార్కెట్ శాఖ అధికారులు ప్రమాణం చేయించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో అభివృద్ధి చెందుతుంటే.. అది చూస్తూ ఓర్వలేని ఆంధ్రా పాలకులు వారి బినామీలతో వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలా ఉందా అంటూ ప్రశ్నించారు. పాదయాత్రలు చేసేవారు దీనికి సమాధానం చెప్పాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. దానిపై కూడా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. నోటికొచ్చినట్టు వాగుతున్న నాయకులు.. దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ రాములు, జడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ హన్మంతరావు, డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, గాయకులు సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.