నాలుక చీరేస్తాం బిడ్డా.. బండిపై మంత్రి సంచలన వాఖ్యలు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ‘పిచ్చి ఆసుపత్రి నుంచి పట్టుకొచ్చిన పిచ్చోడిలా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం పర్యటించిన బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ […]

Update: 2021-03-07 01:26 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. ‘పిచ్చి ఆసుపత్రి నుంచి పట్టుకొచ్చిన పిచ్చోడిలా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం పర్యటించిన బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్, కల్వకుర్తి, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.

గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడలేదు.బండి సంజయ్ పిచ్చి ఆస్పత్రి నుండి తీసుకొచ్చిన పిచ్చోడిలా, ఉన్మాదిలా మారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నోరుపారేసుకుంటావా బిడ్డ..? రైతుబంధు ఇస్తున్నందుకా …? ప్రాజెక్టులు కడుతున్నందుకా..? ఎందుకు సీఎంను జైల్లో పెడతారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తావా ? నీకు అమ్మ భార్య బిడ్డలు, చెల్లెళ్లు లేరా అని ప్రశ్నించారు. కుల వృత్తులు చేసుకొని జీవించే బడుగు బలహీన వర్గాల వారిని అవమానిస్తారా…? మా నేత ,మా కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు తలుచుకుంటే నీవు బయట తిరగ లేవు బిడ్డ అని మంత్రి హెచ్చరించారు.

పూటకో పార్టీ మారి రాజకీయాలు చేస్తున్న నీవా మమ్మల్ని విమర్శించేది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. మా కొంపలు కూలి పోని అంటావా ? గద్వాల ప్రజలు నీ కొంప కూల్చారు. గుర్తించుకో అని మంత్రి అన్నారు. మీ చరిత్ర ఏంటో రాయడానికి గ్రంథా లే సరిపోవు అన్నారు.మీ భర్త భూత్పూర్ మహబూబ్ నగర్ మధ్య రోడ్డు బ్రిడ్జిల నిర్మాణ కాంటాక్ట్ ను ఆరు సంవత్సరాల క్రితం దక్కించుకున్నాడు.ఇప్పటివరకు వాటిని పూర్తి చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు.

ఒక బీసీ మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే అతడినిపిలువకుండా కార్యక్రమాల జరుపుకుంటున్నారు. అతను రానున్న రోజులలో ఎంపీగా పోటీ చేసి బలమైన నాయకునిగా ఎదుగుతాడని భయంతోనే ఇటువంటి కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మాకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి. మీలా బరితెగించి మాట్లాడమని మంత్రి హెచ్చరించారు. ఇక ముందు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, డిసిసిబి వైస్ చైర్మన్ కోరమని వెంకటయ్య, నాయకులు కృష్ణ మోహన్, కట్ట రవి కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News