కలెక్టర్‌కు సత్యవతి ఫోన్.. ఆదుకోవాలని సజేషన్

దిశ ప్రతినిధి, వరంగల్: లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. ఎడతెరపిలేని భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నందున గోదావరి నది పరివాహక ప్రాంతంలోని గిరిజనులు, ఆదివాసీలు నివసిస్తుండడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. ఈ మేరకు మంత్రి ఆదివారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే గిరిజనులు, […]

Update: 2020-08-16 02:25 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. ఎడతెరపిలేని భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నందున గోదావరి నది పరివాహక ప్రాంతంలోని గిరిజనులు, ఆదివాసీలు నివసిస్తుండడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది.

ఈ మేరకు మంత్రి ఆదివారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే గిరిజనులు, ఆదివాసీలను దగ్గర్లో ఉన్న గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అక్కడే పునరావాసం కల్పించాలన్నారు. వరదల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు సమాచారాన్ని అందించాలని మంత్రి కోరారు.

మున్నేరు వాగును పరిశీలించిన మంత్రి

మహబూబాబాద్ జిల్లా రాంపూర్ వద్ద మున్నేరు వాగు ఉధృతిని మంత్రి పరిశీలించారు. మున్నేరు వాగు పూర్తి స్థాయిలో పొంగుతుండడంతో దాని పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మంత్రి వెంట జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోత్ బిందు, ఇతర నాయకులు, అధికారులున్నారు.

Tags:    

Similar News