పోడు భూములకు రైతు బంధు.. మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన

దిశ, మహబూబాబాద్ టౌన్: పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కల్పించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు.. లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవన్‌లో అడవుల సంరక్షణ, పోడు భూములపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలంటూ గిరిజనులు కోరుతున్నారని గుర్తు చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు వారి హక్కులను కాపాడుతూ, అటవీ […]

Update: 2021-11-02 08:08 GMT

దిశ, మహబూబాబాద్ టౌన్: పోడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కల్పించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు.. లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం స్థానిక గిరిజన భవన్‌లో అడవుల సంరక్షణ, పోడు భూములపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించాలంటూ గిరిజనులు కోరుతున్నారని గుర్తు చేశారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు వారి హక్కులను కాపాడుతూ, అటవీ సంపద తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ సమస్యను అందరం కలిసికట్టుగా చర్చించుకుని జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించుటకు కృషి చేద్దామన్నారు. నవంబర్ 8 వ తేదీలోగా కమిటీలను ఏర్పాటు చేసుకుని గ్రామస్తుల సమక్షంలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోడు హక్కులు కల్పించి, సాగుకు యోగ్యంగా భూములను తీర్చి దిద్దుతామని, ఆ భూములకు సదుపాయాలు కల్పించి రెండు పంటలు పండించుకునే విధంగా చేసి, రైతు బంధును కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News