‘కరోనా’ను ఎదుర్కొనేందుకు మంత్రి ఔషధ యాగం
దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, ఆ వైరస్‌ను తట్టకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు లభించాలని కోరుతూ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఔషధ యాగం జరిపించారు. మహబూబాబాద్‌లోని అయ్యప్ప దేవాలయంలో నంబ్రూద్రిల పర్యవేక్షణలో ఔషధ మూలికలతో జరిపిన ఈ యాగంలో పాల్గొన్న అనంతరం సత్యవతి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుంచి ప్రజలందరూ విముక్తులు కావాలనీ, మానవ జాతి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ యాగాన్ని లోకకళ్యాణం కోసం పూర్తిగా స్వాములు నిర్వహించినట్లు […]
దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, ఆ వైరస్‌ను తట్టకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు లభించాలని కోరుతూ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఔషధ యాగం జరిపించారు. మహబూబాబాద్‌లోని అయ్యప్ప దేవాలయంలో నంబ్రూద్రిల పర్యవేక్షణలో ఔషధ మూలికలతో జరిపిన ఈ యాగంలో పాల్గొన్న అనంతరం సత్యవతి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుంచి ప్రజలందరూ విముక్తులు కావాలనీ, మానవ జాతి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ యాగాన్ని లోకకళ్యాణం కోసం పూర్తిగా స్వాములు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఆర్ధిక వనరుల కంటే, మానవ మనుగడే ముఖ్యమని భావించే సీఎం కేసీఆర్‌కు మరింత శక్తిని ఇవ్వాలని ఆశించారు. ఆయన సంకల్పంలో విజయం సాధించాలనీ, రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని యాగంలో దేవున్ని ప్రార్థించినట్టు తెలిపారు.
tags: minister satyavathi rathod, yagam, corona virus, mahabubabad, ayyappa temple, face corona virus,