సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి
దిశ, వరంగల్: రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కురవి మండలంలోని మొగిలిచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు రూ.30 కోట్లు కేటాయించామన్నారు. గన్నీ బ్యాగుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వరంగల్ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పశ్చిమ బెంగాల్‌లో గన్నీ బ్యాగుల పరిశ్రమ మూత పడిందని.. రైతులే సంచులు తెచ్చుకుంటే […]
దిశ, వరంగల్: రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కురవి మండలంలోని మొగిలిచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు రూ.30 కోట్లు కేటాయించామన్నారు. గన్నీ బ్యాగుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వరంగల్ జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పశ్చిమ బెంగాల్‌లో గన్నీ బ్యాగుల పరిశ్రమ మూత పడిందని.. రైతులే సంచులు తెచ్చుకుంటే రూ.24.50లు ఇప్పిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
Tags: minister, sathyavathi rathod, pady, purchasing centre, opening, ts news, warangal