రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కందూకుర్ మండలం సాయిరెడ్డి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ […]

Update: 2020-04-15 07:08 GMT

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కందూకుర్ మండలం సాయిరెడ్డి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ చెంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్‌ మండలం మంగళపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ జనార్దన్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ వెంకటేష్ గుప్తా, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Tags : lockdown, rice purchasing centers, minister samitha opening, rangarredy

Tags:    

Similar News