మీర్పేట్లో మంత్రి పర్యటన
దిశ, రంగారెడ్డి: మీర్పేట్లోని పెద్దచెరువును సుందరీకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, కబ్జా కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడ జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న రజక కులస్తులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా మంత్రి తనిఖీ […]
దిశ, రంగారెడ్డి: మీర్పేట్లోని పెద్దచెరువును సుందరీకరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణలో భాగంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, కబ్జా కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అక్కడ జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న రజక కులస్తులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా మంత్రి తనిఖీ చేశారు. అక్కడ ఉన్న చిన్నారులతో సరదాగా మాట్లాడి.. ఒక చిన్నారితో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్షరాభ్యాసం చేయించారు.