కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలి

దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం మండలంలోని పొరండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని కోరారు. ఎవరికి కేటాయించిన సమయంలో వారు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిరుపేద కుటుంబలకు నిత్యావసర సరుకులు అందజేశారు. […]

Update: 2020-04-17 05:46 GMT

దిశ, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. మహేశ్వరం మండలంలోని పొరండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో సామాజిక దూరం పాటించాలని కోరారు. ఎవరికి కేటాయించిన సమయంలో వారు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిరుపేద కుటుంబలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister sabitha indra reddy,Grain purchase center, Launch

Tags:    

Similar News