‘ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం’
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగానే మొదట మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నింపి వ్యవసాయ భూములకు సాగు నీరు అందిస్తామన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామ కత్వలో చెక్ డ్యాం నిర్మాణ పనులు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగానే మొదట మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నింపి వ్యవసాయ భూములకు సాగు నీరు అందిస్తామన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామ కత్వలో చెక్ డ్యాం నిర్మాణ పనులు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి ఎకరాకు త్వరలో సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.