‘అవినీతి లేకుండా చేయటమే లక్ష్యం’
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో 158 రోడ్ల నిర్మాణ, మరమత్తుల కోసం సీఎం కేసీఆర్ రూ.658 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగానే చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో చేవెళ్ల నుంచి మల్కాపూర్ వరకూ రూ.2కోట్ల 72 లక్షలతో రోడ్లను నిర్మించనున్నామని తెలిపారు. ఆదివారం చేవెళ్లలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌లతో కలిసి మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మోడల్ […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో 158 రోడ్ల నిర్మాణ, మరమత్తుల కోసం సీఎం కేసీఆర్ రూ.658 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. అందులో భాగంగానే చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో చేవెళ్ల నుంచి మల్కాపూర్ వరకూ రూ.2కోట్ల 72 లక్షలతో రోడ్లను నిర్మించనున్నామని తెలిపారు. ఆదివారం చేవెళ్లలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌లతో కలిసి మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మోడల్ స్కూల్‌ల వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వరకూ రెండు లైన్లు, నుంచి మొదలుకొని, నాలుగు లైన్లు, ఆరు లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేయటానికి సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. చేవెళ్ల-మల్కాపూర్ రోడ్డు డిమాండ్ చాలా రోజులుగా ఉందని, నేడు సాకారం అవుతుందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నూతన రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు.
నూతన రెవెన్యూ బిల్లుతో సంతోషంగా ఉందన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వ్యవస్థలలో అవినీతి లేకుండా చేయటమే చట్టం లక్ష్యమన్నారు. గతంలో అనేక భూ సంస్కరణలు వచ్చినా, నేడు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన చట్టం అత్యుత్తమమైనదన్నారు. వీఆర్ఓలకు ఉద్యోగ భద్రత, వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తూ వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగం ఇవ్వటానికి సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు.