హాట్‌టాపిక్‌గా మారిన మంత్రి సబితా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవిర్భావంతో టీడీపీలోని నేతలు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ ఖాళీయైయింది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపోందారు. అయితే పార్టీ ప్రయోజనాలకంటే వ్యక్తిగత విలువల కోసం కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ మారిన నుండి మౌనంగా […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవిర్భావంతో టీడీపీలోని నేతలు టీఆర్ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ ఖాళీయైయింది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపోందారు. అయితే పార్టీ ప్రయోజనాలకంటే వ్యక్తిగత విలువల కోసం కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ మారిన నుండి మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలు టీపీసీసీ ఎన్నికతో విమర్శలకు పదును పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలుగా గెలువగా 10 మంది పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్‌లో చేరారు. శాసనసభ నిబంధనల మేరకే కాంగ్రెస్ సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారని స్పీకర్ స్పష్టం చేశారు.
ఈ విలీనానికి ముందుండి నడిపించిన నేతలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని రాజకీయంలో అగ్గిరాజుకుంది. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పులతో కొట్టాలని విమర్శించారు. విమర్శలకు ప్రతివిమర్శలు చేయడంతో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కేంద్రంగానే రాజకీయం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పీసీసీ పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ కమిటీ ప్రచార చైర్మన్ మధుయాష్కీ మంత్రి సబితా, సుధీర్ రెడ్డిలపై ఘాటైన విమర్శలు చేశారు. ఈ విమర్శలతో రంగారెడ్డి జిల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలించింది.
ఉత్సాహాంలో టీఆర్ఎస్ ఉద్యమకారులు…
ఉద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేని ఎమ్మెల్యేలు, నేతలు రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్‌లో రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయించి రాజకీయాలు చేస్తున్నారు. మొదటి నుండి పార్టీకి అండదండగా ఉండి పనిచేస్తున్న నేతలను కాదని టీఆర్ఎస్ ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యతనిస్తుంది. ఉద్యమకాలం నుంచి నేటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కాంగ్రెస్ నాయకులు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చేస్తున్న విమర్శలను ఉద్యమకారులు సమర్ధిస్తున్నారు. ఇప్పటికైన ప్రజాస్వామ్య బద్దంగానే రాజకీయాలు ఉండాలని అనేక మంది కోరుకుంటున్నారు. సబితా, సుధీర్ రెడ్డిలు అవకాశవాధ రాజకీయాలు చేస్తారనే ప్రచారం సాగుతుంది. రేపటి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలువదని, తెలిస్తే తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు మోహమాటం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదీఏమైనా అధికార పార్టీలో ఉండి తమదైన ముద్ర వేసుకోవాలనే భావనతో పనిచేస్తారని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడే అసలైన రాజకీయం నడుస్తోందని జిల్లాలోని నాయకులు చర్చించుకుంటున్నారు.
విమర్శలకు సహాసం చేయని వైనం…
పార్టీ ఫిరాయించిన మంత్రి, ఎమ్మెల్యేపై గాంధీ భవన్ వేదికగా మధుయాష్కీ విమర్శిస్తే ప్రతి విమర్శ చేయడానికి టీఆర్ఎస్ నేతలు సహాసం చేయడం లేదు. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై ఆ ఎమ్మెల్యే మాత్రమే కౌంటర్ వేశారు. ఆ కౌంటర్‌కు కాంగ్రెస్ నేతలు క్షేత్రస్ధాయిలోని కార్యకర్తలు సైతం స్పందించి దిష్టిబొమ్మల దహానం, ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేశారు. అదేవిధంగా మధుయాష్కీ మంత్రి, ఎమ్మెల్యేలపై ఘోరంగా విమర్శించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు, కౌంటర్ చేసేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. విమర్శలకు, ప్రతివిమర్శలు చేయడంతో రాజకీయ చర్చకు అవకాశం ఉంటుందని విశ్లేషుకులు భావిస్తున్నారు. అందుచేత టీఆర్ఎస్ నేతల నోళ్లకు తాళాలు వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలుగానీ, విమర్శలకు గానీ నాయకులు స్పందిస్తే ఆ పార్టీకి భవిష్యత్తు చూపించినట్లు ఉంటుందనే చర్చ టీఆర్ఎస్ నేతల్లో నడుస్తోంది.