జాతీయ పండుగగా ప్రకటించాలి

          తెలంగాణ కుంభమేళా అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎన్నిమార్లు కేంద్రాన్ని కోరిన వారి నుంచి స్పందన కరువైందని ఆయన తెలిపారు. గురువారం చిల‌క‌లగుట్టను మంత్రి సంద‌ర్శించారు. అంతేకాకుండా           భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామని వివరించారు. అధికారులు, పోలీసులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సాయంకాలం […]

Update: 2020-02-06 07:54 GMT

తెలంగాణ కుంభమేళా అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎన్నిమార్లు కేంద్రాన్ని కోరిన వారి నుంచి స్పందన కరువైందని ఆయన తెలిపారు. గురువారం చిల‌క‌లగుట్టను మంత్రి సంద‌ర్శించారు. అంతేకాకుండా

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామని వివరించారు. అధికారులు, పోలీసులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సాయంకాలం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దె మీదకు రానున్నడంతో జాతరలో అసలు ఘట్టం మొదలవ్వనుంది. అమ్మవారిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి వెల్లడించారు. జంప‌న్నవాగు వ‌ద్ద భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకున్న మంత్రి ఈ ఏడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లను పెంచామన్నారు.

Tags:    

Similar News