‘అధికారుల ప‌నితేరు భేష్‌.. ఖమ్మంలో కరోనా జీరో’

దిశ‌, ఖ‌మ్మం : క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అధికారులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని ఖ‌మ్మం జిల్లా వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి అజ‌య్‌కుమార్ అభినందించారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాక‌పోవ‌డంపై ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందులో అధికారుల కృషి ఉంద‌ని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని వైద్యాధికారులకు సూచించారు. కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్‌లోని సమావేశ మందిరంలో […]

Update: 2020-04-05 02:18 GMT

దిశ‌, ఖ‌మ్మం : క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అధికారులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నార‌ని ఖ‌మ్మం జిల్లా వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని రాష్ట్ర ర‌వాణాశాఖ మంత్రి అజ‌య్‌కుమార్ అభినందించారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాక‌పోవ‌డంపై ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందులో అధికారుల కృషి ఉంద‌ని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని వైద్యాధికారులకు సూచించారు. కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ కర్ణన్ అధ్య‌క్ష‌త‌న అధికారుల‌తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు ఆంధ్ర‌ప్రదేశ్‌లో పరిస్థితి అదుపు త‌ప్పుతున్న విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రాక‌పోక‌ల‌పై ఎక్కువ‌గా దృష్టి సారించాల‌ని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారిని, గతంలో వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేయాల‌న్నారు. క్వారంటైన్‌లో ఉంచిన వారి ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌ని సూచించారు. ఇప్పటివరకూ సిబ్బంది బాగా పని చేశారని, ఇక ముందు కూడా ఇదే విధంగా కొన‌సాగించాల‌న్నారు. మరో నెల రోజుల పాటు కృతనిశ్చయంతో పని చేస్తే కరోనా మహమ్మారిని శాశ్వ‌తంగా త‌రిమికొట్ట‌గ‌ల‌మ‌ని తెలిపారు. స‌మీక్ష‌కు ముందు జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కరోనా ప్రత్యేక వార్డులను మంత్రి సంద‌ర్శించారు.కలెక్టర్ కర్ణన్, డీఎంహెచ్‌వో మాలతితో కలిసి ఆసుపత్రిలోని కరోనా ప్రత్యేక విభాగాన్ని సందర్శించారు. ఓపీ, ఐపీ, జనరల్ వార్డులు, ఐసీయూ వార్డుల్లో అందుతున్న సేవ‌ల‌పై ఆరా తీశారు. ఇప్పటివరకూ ఖమ్మం జిల్లా నుంచి 960 మందికి పైగా ఓపీ ద్వారా వైద్యులు చెక‌ప్ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. అందులో 154 మంది అనుమానితుల శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపడం జరిగిందన్నారు. ఇప్పటివరకూ ఖమ్మం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. అయినప్పటికీ ఎటువంటి అవాంతర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 170 బెడ్స్‌తో పాటు అదనంగా 50 ఐసీయూ బెడ్లను, మమత ఆసుపత్రిలో 200 బెడ్ల‌ను, పాత శారద ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి రోజూ జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో, ఇతర వైద్యులు నిత్యం జిల్లాలో పర్యటిస్తున్నార‌ని అన్నారు. ప్రస్తుతం 200 ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్టు తెలిపారు. ఆదివారం సాయంత్రంలోగా అదనంగా మరో 1000 కిట్లు వస్తున్నాయన్నారు. ఈ నెల ఏప్రిల్ 15 వరకు ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags: Minister Puvvada Ajay Kumar, visited, hospital, khammam, coronavirus

Tags:    

Similar News